భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘన నివాళులర్పించారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశానికి బలమైన పునాది వేసిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని, సమానత్వం మరియు న్యాయం ప్రాతిపదికన దేశాన్ని ముందుకు నడిపించడంలో ఆయన చూపిన బాట నిరంతరం మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు.

