హిల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.హిల్ట్ పాలసీ జీఓ నిబంధనలకు విరుద్ధమని పర్యావరణవేత్త పురుశోత్తం, కేఏ పాల్ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వం 9,292 ఎకరాల భూకేటాయింపు అంశంపై సిబిఐ, ఇడితో దర్యాప్తు చేయించాలని, పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.