గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారును లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే, హుస్నాబాద్ మండలం పందిళ్ళ వంతెన సమీపంలో జరిగింది. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గంగం శ్రీధర్ రెడ్డి కుటుంబంతో పందిళ్ళ వంతెన వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. భార్య, కుమారుడు నిహాన్ రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి.

