సిక్కిం రాష్ట్ర ఆవిర్భావించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. సిక్కిం అభివృద్ధిని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే అభివృద్ధి మళ్లీ పుంజుకుందని అన్నారు. మతం, రాజకీయాల పేరుతో దేశాన్ని విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో హిమాలయ రాష్ట్రమైన సిక్కిం జాతి ఐక్యతను సగర్వంగా చాటిచెబుతోందని ప్రధాని అన్నారు. ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తిని సిక్కిం అద్భుతంగా ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.

