కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్లనూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రవి, లలిత ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు, ఇటీవల వారి దాంపత్య జీవితంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఎల్.ఎం.డీ పోలీస్ స్టేషన్లో లలిత తాళి, మెట్టెలు తీసేసి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు కూతుర్లు తనకూ వద్దంటూ తండ్రి రవి వదిలి వెళ్లిపోయాడు. పోలీసులు పిల్లల నానమ్మను పిలిచి అప్పగించారు.

