ఒడిశాలోని క్యూంఝర్ జిల్లాలో జీతూ ముండా అనే వ్యక్తి తన సోదరి కలారా ముండా రెండు నెలల కిందట చనిపోయింది. ఆమె బ్యాంక్ ఖాతాలో దాదాపు 20 వేల రూపాయలు ఉన్నాయి. సోదరి బ్యాంక్ ఖాతా నుండి డబ్బు విత్ డ్రా కోసం పదేపదే చేసిన అభ్యర్థనలను అధికారులు పట్టించుకోలేదు. ఆ డబ్బు విత్ డ్రా చేసి ఇవ్వాలని కోరగా, వ్యక్తిగతంగా రావాలని సూచించడంతో దాంతో విసిగిపోయిన వ్యక్తి చేసేదేమీ లేక సాక్ష్యం కోసం సోదరి అస్తిపంజరాన్ని బ్యాంకుకు తీసుకెళ్లి వారికి షాకిచ్చాడు

