సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారత హైకమీషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వంలో, పారిశ్రామిక వేత్తల్లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, ఆ దేశంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్‌లో భారతీయుల కార్యకలాపాల గురించి భారత హై కమిషనర్ సీఎంకు వివరించారు.

