ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసబల్లి తహశీల్దార్, మరికొందరు అధికారుల నిర్వాకం వల్ల చింతగూడెం గ్రామంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఇతరులకు
బదిలీ అయినట్లు సమాచారం. ఈ ఘటనలో, 30 గుంటల ప్రభుత్వ భూమిని తహశీల్దార్ డిజిటల్ సైన్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించినట్లు స్థానిక గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో, ఆగ్రహించిన చింతగూడెం గ్రామస్తులు కల్లూరు సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

