తూర్పు ఇరాక్‌లోని కుట్ (Kut) నగరంలోని ఓ హైపర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కనీసం 50 మంది మరణించినట్లు ప్రావిన్స్ గవర్నర్‌ను ఊటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఐఎన్ఏ నివేదించింది. అనేక మంది గాయపడ్డట్లు పేర్కొంది.

