వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గతంలో పలు కేసుల్లో రిమాండ్‌లోకి వెళ్లి ఇటీవలే వంశీ జైలు నుంచి విడుదలయ్యారు విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు అయ్యింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు 8 మందిపై కూడా కేసు నమోదు అయ్యింది.2024 జూలై నెలలో వల్లభనేని వంశీతోపాటు ఆయన అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారంటూ సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

