ప్రత్యేక ప్రతిభావంతులకు ఏపీ సమగ్రశిక్ష ఆధ్వర్యంలో విద్యార్థుల బృందం నేపాల్ ఎవరెస్ట్ శిఖర అధిరోహణ యాత్ర చేపట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారి. ఏప్రిల్ 15 నుండి 16 రోజుల పాటు ఈ సాహసయాత్ర చేసింది.. 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అధిరోహించారు. వీరిలో 8 మంది బాలికలు, 13 మంది బాలురు ఉన్నారు.

