మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. సునీత తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. హత్య కేసులో మరింత దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీతతోపాటు, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అప్పటి సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై పెట్టిన కేసులను క్వాష్ చేస్తామని ధర్మాసనం వివరించింది.

