అధికారం అనే కుర్చీ కోసమే వైఎస్ జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తానని ప్రకటించడంపై యనమల ఘాటుగా స్పందించారు. తన స్వార్ధ ప్రయోజనాల కోసమే జగన్ పాదయాత్ర చేస్తానంటున్నారు అని విమర్శించారు. వైఎస్ జగన పాలనలో ప్రజలు నానా కష్టాలు పడ్డారు అని జగన్ అంటే అరాచకం, ధరల పెరుగుదల, సున్నా అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థ సంక్షోభం వంటివే గుర్తొస్తాయి అని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.

