తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు డిమాండ్లతో విద్యుత్ యాజమాన్యంతో జరిగిన జేఏపీ చర్చలు విఫలమయ్యాయి. ప్రధానంగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అంశంపై విద్యుత్ యాజమాన్యం ఎటు తేల్చకపోవడంతో చర్చలు పలప్రదం కాలేదు. దాంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మె అంశానికి సంబంధించి కాసేపట్లో ప్రకటన చేసే అవకాశం ఉంది. విద్యుత్ యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె దిశగా .జేఏసీ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

