విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రముఖ టెక్ సంస్థ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అమెరికా లో చదువుల కోసం పెద్ద మొత్తంలో విద్యా రుణాలు తీసుకోవడంలో ఉన్న ప్రమాదాల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగ మార్కెట్ చాలా బలహీనంగా ఉందని, ఇమ్మిగ్రేషన్ పరమైన సవాళ్లు కూడా పెరిగాయని ఆయన స్పష్టం చేశారు.

