తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన టీవీకే (TVK) అధినేత, దళపతి విజయ్.. రాజకీయాల్లో కొత్త శకాన్ని ప్రారంభించే ముందు తన తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలని నిర్ణయించుకోవడం విశేషం. నీలాంకరైలోని తన నివాసం నుంచి బయలుదేరిన విజయ్, నేరుగా అడయార్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. తల్లిదండ్రులను కలిసిన అనంతరం విజయ్ ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లనున్నారు.
విజయ్ ఇంటి బయట భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. విజయ్ కాన్వాయ్ వెంట అభిమానులు నీరాజనాలు పలుకుతూ ర్యాలీగా వెళ్తున్నారు.

