ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం 33 మంది ప్రయాణికులు ఒక బస్సులో అజ్మీర్ నుంచి పుష్కర్ వెళ్తున్నారు. పుష్కర్ ఘాటి ప్రాంతంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. చెట్లు, పొదల్లో అది చిక్కుకున్నది.

