పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో 13 మంది మృతి చెందారు. ఈ సంఘటన నేపాల్ దేశం బైటడి జిల్లా పూర్చౌడి మున్సిపాలిటీ-7లో జరిగింది. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. 16 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 60 మంది బస్సు భావానే నుంచి బజాంగ్‌కు వెళ్తుండగా బడ్గౌన్ మోడ్ వద్ద బస్సు లోయలో పడింది.

