ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో 2100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌కు కొన్ని గంటల ముందే దుర్గ్ జిల్లాలోని భిలాయ్‌లో ఉన్న భూపేష్ బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది.

