మైక్రోఫైనాన్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తనపై రావడంతో, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ మంగ్లీ సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌ను కలిసి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. మంగ్లీ తన ఫిర్యాదులో న్యాయవాది సుబ్బారావుపై కీలక ఆరోపణలు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన సోషల్ మీడియాలో మరియు ఇతర వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తన పేరును అడ్డుపెట్టుకుని ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

