లండన్‌లో ఘనంగా గోదారోళ్ల సంక్రాంతి వేడుకలు – 2026 ఘనంగా నిర్వహించారు. బ్రిటన్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచే గోదారోళ్ల సంక్రాంతి వేడుకలు కేరింతల మధ్య సరదాగా సాగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తెలుగు కుటుంబాలు హాజరయ్యారు. సంక్రాంతి పండుగ ప్రత్యేకతను చాటేలా భోగి మంటలు, ముగ్గులపోటీలు, హరిదాసుల కీర్తనలు, గొబ్బెమ్మల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు సంప్రదాయ చీరల్లో, పురుషులు పంచెకట్టుతో హాజరయ్యారు.

