ఆపరేషన్ థియేటర్లో టేబుల్ మీద పడుకున్న వ్యక్తికి సెక్యూరిటీ గార్డు కుట్లు వేస్తున్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు చేయాల్సిన చికిత్స.. ఇలా సెక్యూరిటీ గార్డు చేయడంతో ప్రభుత్వంపై వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లోకి ఎవరినైనా పంపిస్తారా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలో బగాహా పట్టణంలోని సబ్ డివిజనల్ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది.

