ఏపీలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డుల ప్రదర్శన నేపథ్యంలో అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటికల్లా రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ సరఫరా పెరగాలని సీఎం అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోండని అధికారులకు సూచనలు చేశారు. అలాగే పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఆప్షన్ ఎందుకు ఇవ్వడం లేదని హెచ్ పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులను నిలదీశారు. రేపటిలోగా ఎక్కడా నో స్టాక్ బోర్డులు కనిపించవద్దని తెలిపారు.

