త్వరలో మరో 40,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రూ.262 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ముఖ్యంత్రి శంకుస్థాపన చేశారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ హుస్నాబాద్ నుంచే బహుజన దండు కట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం ఈ ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ఎగసిపడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చామని, ప్రజాపాలన రెండున్నరేళ్లు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

