రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేయకపోతే మరోసారి 25 శాతం టారిఫ్‌లు విధిస్తామని అమెరికా హెచ్చరించడం తీవ్ర వివాదానికి దారితీసింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం తీసుకునే నిర్ణయాలపై విదేశీ దేశం ఒత్తిడి తెస్తుండటంపై రాజకీయ, ఆర్థిక నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా విధిస్తున్న షరతులు భారత్ సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఇక ఈ ఒత్తిళ్ల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఆయన ఉపయోగించిన కఠినమైన పదజాలం కూడా విమర్శలకు గురవుతోంది.

