మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డిని కాకినాడ నుంచి హైదరాబాద్కు తరలించారు. కుటుంబ సభ్యులు కిర్లంపూడికి తీసుకువెళ్లిన తర్వాత, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ముద్రగడ పద్మనాభం వెంట ఆయన కుమారుడు గిరిబాబు, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. ఆయన్ను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించనున్నారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కాకపోతే వైఎస్ జగన్ సూచనతో.. ముందస్తు జాగ్రత్తగా, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు చెబుతున్నారు

