గ్రీన్‌ల్యాండ్ విషయంలో డెన్మార్క్ తీవ్రంగా యూఎస్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా బలవంతంగా గ్రీన్ ల్యాండ్ ఆక్రమించాలని చూస్తే ఆదేశాల కోసం చూడకుండా మొదట కాల్పులు జరపాలని తమ సైన్యానికి స్పష్టం చేసింది. ముందు కాల్పులు జరపండి.. ఆ తర్వాత ప్రశ్నలు అడగండి అని నిబంధనను అమల్లోకి తీసుకువచ్చినట్లు రక్షణ శాఖ ప్రకటించింది .ఇది కేవలం గ్రీన్ ల్యాండ్ సమస్య కాదని నాటో కూటమి మనుగడకే ప్రమాదం అని డెన్మార్క్ హెచ్చరించింది.

