ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కవిత, ఆమె కుటుంబం హత్యయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ తరహా దాడులతో బిసిలను, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మేం చేసే ప్రయత్నం కొంచెం కూడా తగ్గదు. ఇలాంటి వాటికి నేను భయపడను. మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తాం. రాసి పెట్టుకోండి..
రానున్న మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది.

