లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళల హక్కులను ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా కాలరాశాయని ఆయన మండిపడ్డారు. మహిళా బిల్లు పరాజయానికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎన్డీయే పక్షాలు చేపట్టిన భారీ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళా సాధికారత పట్ల కాంగ్రెస్, ఇతర విపక్షాల కపట నాటకాలు బట్టబయలయ్యాయని విమర్శించారు.

