ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడికి పాల్పడింది. రాజధాని కీవ్ పై డ్రోన్ల తో విరుచుకుపడింది. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 48 మంది గాయపడ్డారు. మాస్కో దాదాపు 598 డ్రోన్లు, 31 క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు.

