ఈ ఏడాది రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ‘మిరాయ్’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించి అందరిని మెప్పించారు. ఆయన నటిస్తున్న రీసెంట్ సినిమా ‘డేవిడ్ రెడ్డి’. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో మనోజ్ చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. గ్లింప్స్ చూస్తే సినిమా ఓ రేంజ్లో ఉండనుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా.. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహించారు.

