గుంటూరులోని మోతీలాల్ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ బందోబస్తు నడుమ నిరుపేదల ఇండ్లను అధికారులు తొలగించారు. అయితే తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఇండ్లను ఎలా తొలగిస్తారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఫలంగా పిల్లలు, వృద్ధులను తీసుకొని ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే నజీర్ వద్దకు వెళ్లి న్యాయం చేయాలని గోడు వెళ్లబోసుకున్నారు. సాయం లేదు వెళ్లి రైలు కిందపడి చావండంటూ ఉచిత సలహా ఇచ్చారని బాధితులు ఆరోపించారు.

