పశ్చిమ బెంగాల్లో విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ , “బెంగాల్లో కమలం వికసించింది. ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచారు” అని పేర్కొన్నారు. పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాలు బీజేపీకి తూర్పు భారతంలో బలం వచ్చిందని తెలిపారు. గంగా ప్రవాహం గురించి ప్రస్తావించానని, బెంగాల్ విజయంతో అది ఇప్పుడు నెరవేరినట్లు కనిపిస్తోందని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు ఇప్పుడు కమలం వికసించిందని ఆయన అన్నారు.

