తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జన్ సురాజ్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎవరు?, బీహార్‌లో ఆయన హోదా ఏమిటి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గతంలో బీహార్ ప్రజలను అవమానించారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. బీహార్‌ను అవమానించే నాయకులతో తిరుగుతున్న రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని ఇది ప్రతిబింబిస్తుందని ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి బీహార్‌లోని ఏ గ్రామానికి వెళ్లినా, ప్రజలు కర్రలతో తరిమి కొడతారని హెచ్చరించారు.

