బీసీ బిల్లు సాధన కోసం మూడు రోజులపాటు దీక్ష చేయడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకున్నారు. బీసీ బిల్లు ప్రాముఖ్యత చాటి చెప్పేందుకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటలపాటు దీక్ష చేపడతానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకుని నిరాహారదీక్ష చేస్తామన్నారు. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే నిరాహారదీక్షకు సిద్ధమని స్పష్టంచేశారు.

