టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో ఆమెకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ది రాజా సాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ తిరిగి వెళ్లేందుకు నిధి ప్రయత్నిస్తుండగా, ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ వైరల్ వీడియోలో గుంపులు గా ఉన్న జనాల మధ్య నుంచి.. తన కారు దగ్గరకు వెళ్లడానికి.. నిధి అగర్వాల్ ఎంత ఇబ్బంది పడింది అనేది స్పష్టంగా కనిపించింది.

