అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీకి అపూర్వ స్వాగతం లభిస్తోంది. కోల్కతా, హైదరాబాద్ పర్యటన తర్వాత ఆదివారం ముంబై చేరుకున్న మెస్సీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు వాంఖడే స్టేడియం చేరుకున్న ఫుట్బాల్ దిగ్గజాన్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కలిశాడు. తన పదో నంబర్ టీమిండియా జెర్సీని మెస్సీకి కానుకుగా అందించాడు సచిన్. సాకర్ మాంత్రికుడి జెర్సీ నంబర్ కూడా 10 కావడం విశేషం. జెర్సీ బహూకరణ సమయంలో మెస్సీతో ముచ్చటించిన మాస్టర్ బ్లాస్టర్.. మెస్సీ బృందంతో కలిసి ఫొటోలకు ఫొజిచ్చాడు.

