దేశ రాజధాని ఢిల్లీలోని గోకల్పురిలో ప్రేమించిన వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసిన ఆ ప్రేమికురాలు.. ప్రియుడిపై కోపాన్ని పెంచుకోవడానికి బదులుగా అతడిని చేసుకోబోయే అమ్మాయిని అసూయ పెంచుకుంది. బుధవారం తెల్లవారుజామున నిందితురాలు.. బాధితురాలి ఇంటికి వెళ్లింది. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి.. ఆమె ముఖంపై యాసిడ్ పోసింది. దీంతో బాధితురాలు మంటతో కేకలు వేస్తూ గట్టి గట్టిగా అరవగా.. అప్పటికే నిందితురాలు అక్కడి నుంచి పారిపోయింది. 26 ఏళ్ల నిందితురాలిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

