ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ స్థాపించి.. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ తృటిలో మృత్యువు నుంచి తప్పించుకున్నారు. జనాల మధ్యలో నడుస్తుండగా.. గుర్తు తెలియని వాహనం వచ్చి ఆయన్ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆయనకు పెద్దగా గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సన్నిహితులు చెబుతున్నారు

