ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా, 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు. 2012లో, మలేరియా వలన 6,27,000 మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువగా ఆఫ్రికన్ పిల్లలు ఉన్నారు

