గ్యాస్ కొరత కారణంగా రాష్ట్రంలోని స్టార్ హోటళ్ల నుంచి జొమాటొ, స్విగ్గీ ఆన్లైన్ ఆర్డర్లను త్వరలో నిలిపివేస్తున్నట్టు హోటళ్ల అసోసియేషన్ జేఏసీ ప్రకటించింది. ముఖ్యంగా ప్రతి సోమవారం రెస్టారెంట్లను పూర్తిగా మూసివేసి ‘వీక్లీ హాలిడే’గా ప్రకటిస్తామన్నారు. కర్ణాటక తరహాలో ఏపీలోనూ కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీ మాత్రమే విక్ర యించే పరిస్థితి వస్తుందన్నారు. రాత్రి 10 గంటల వర కే రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లను నడిపేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

