ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓటు ద్వారానే దేశ భవిష్యత్తుకు దారి ఏర్పడుతుందని ప్రధాని అన్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో కీలకపాత్ర పోషించే భాగ్యవిధాతలు ఓటర్లేనని చెప్పారు. మన దేశ విధిని మార్చగలిగే శక్తి ప్రజలు వేసే ఓట్లకు ఉంటుందని తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మై-భారత్ వాలంటీర్లకు రాసిన లేఖలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా భారత్ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం చాలా కీలకమని ప్రధాని పేర్కొన్నారు.

