తన ఇంట్లో ఎలాంటి డబ్బు దొరకలేదని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. కూకట్పల్లి మోతీనగర్‌లోని ఆయన నివాసంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమతి లేకుండా ఎవరూ లేని సమయంలో పోలీసులు ప్రవేశించారని చెప్పారు. తనను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వాచ్‌మెన్‌ను బెదిరించి తాళం తీయించి దౌర్జన్యంగా లోపలికి వెళ్లారన్నారు.

