పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచ్ ల జేఏసీ అధ్యక్షుడు సుర్వియాదయ్యగౌడ్ సిఎం, పంచాయితీరాజ్ శాఖ మంత్రికి ఒక ప్రకటనలో విజప్తి చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ ఈ నెల 18న( శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ స్వంత ఖర్చులతో చేసి, వడ్డీకి డబ్బులు తెచ్చి ప్రభుత్వ ఆదేశాలకు చేసిన సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

