ముఖ్యమంత్రి చంద్రబాబు పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు కేసును బనాయించి అరెస్టు చేసిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరైంది. శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసింది, అరెస్టు చేసిన తర్వాత 33 గంటల పాటు శ్రీహరిని కోర్టు హాజరుపరచలేదు పోలీసులు. దీనిపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో శ్రీహరిని ఎట్టకేలకు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే కోర్టులో హాజరుపరిచిన వెంటనే బెయిల్ మంజూరు అయ్యింది.

