పుతిన్‌తో చర్చలు నిర్వహించేందుకు జెలెన్‌స్కీ సిద్ధంగా ఉన్నారు. ట్రంప్‌తో భేటీ తర్వాత.. రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. త్రైపాక్షిక మీటింగ్‌కు కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించాడు. ఒకవేళ ద్వైపాక్షక చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్‌తో చెబితే, దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ తెలిపాడు. శాంతి స్థాపన కోసం ఉక్రెయిన్ ఎప్పటికీ వెనుకడుగు వేయదని ఆయన అన్నారు.

