పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌కు అనూహ్యమైన చిక్కులు ఎదురయ్యాయి. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ కావడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వారెంట్‌ను పాకిస్తాన్ కోర్టులు కాకుండా, ‘రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్’ ప్రవాస ప్రభుత్వం జారీ చేయడం గమనార్హం. బలూచిస్తాన్ ప్రాంతంలోని ఏ విమానాశ్రయంలోనైనా, లేదా సరిహద్దుల వద్దనైనా షాబాజ్ షరీఫ్ కనిపిస్తే వెంటనే అరెస్టు చేయాలని ఆ వారెంట్‌లో పేర్కొన్నారు.

