ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనంటారు..! ఇప్పుడు వెనిస్ వాసులూ అదే ఫీలింగ్‌లో ఉన్నారు. అపర కుబేరుడు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ అదరహో అనేలా.. వెనిస్ వైపు ప్రపంచదేశాలు చూసేలా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటే.. నీ పెళ్లొద్దు, నువ్వసలే రావొద్దు అంటూ నిరసనలు హోరెత్తిస్తున్నారు. ప్రైవేట్ జెట్‌లు, భారీ వాహనాలతో క్లీన్ సిటీ కాస్త పొల్యూషన్ సిటీగా మారుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెనిస్ వాసులు. అంతేకాదు సెలబ్రిటీల రాకపోకలు నగరాన్ని స్తంభింపజేస్తాయంటూ.. ఆందోళనలు ఉధృతం చేశారు.

