గాజాలో ఇజ్రాయెల్ చర్యలకు వ్యతిరేకంగా టర్కీ మరో భారీ ముందడుగు వేసింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సహా రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎయాల్ జమీర్ వంటి 37 మంది ఉన్నతాధికారులపై మారణహోం సృష్టించారనే ఆరోపణలతో టర్కీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇస్తాంబుల్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ)లో కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. .అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

