లోక్సభ సీట్లను జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడతాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ మోడల్ ను ప్రతిపాదించారు . దీని ప్రకారం పెంచబోయే అదనపు సీట్లలో 50 శాతం సీట్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలి . మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం , సామాజిక అభివృద్ధి ,ఇతర పనితీరు సూచికల ఆధారంగా కేటాయించాలి.

